![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -970 లో.. రిషిని సేవ్ చేసిన ముసలి వాళ్ళ దగ్గరికి శైలేంద్ర వస్తాడు. శైలేంద్ర రావడంతో వాళ్లకి అతన్ని చూడగానే అనుమానం వస్తుంది. దాంతో ఎందుకు వచ్చావని అడుగుతారు. నడుము నొప్పిగా ఉంది వైద్యం కోసం వచ్చానని శైలేంద్ర అనగానే.. ఆ ముసలివాళ్ళు వైద్యం పేరిట శైలేంద్రని కర్రతో నడుముపై కొడుతుంటారు. ఎన్నో రోజుల పగతో ఉన్నట్లుగా ముసలి వాళ్ళు శైలేంద్రని కొడుతారు.
కాసేపటికి వైద్యం మధ్యలో ఆపితే నరాలు పని చెయ్యవని శైలేంద్రని ఆ ముసలాయన బెదిరిస్తాడు. ఆ తర్వాత శైలేంద్రకు బాడీ మొత్తం మసాజ్ చేస్తుంటారు. కొడితే కొట్టారు కానీ ఇలా బాగుందంటు శైలేంద్ర రిలాక్స్ అవుతున్న టైమ్ లో ముసలాయన సెకండ్ కోటింగ్ స్టార్ట్ చేస్తాడు. ఎడాపెడ ఆ ముసలాయన కొడుతుంటే శైలేంద్ర పడే బాధ వర్ణనాతీతం.. మరొకవైపు శైలేంద్ర ఎక్కడికి వెళ్ళాడంటు ధరణిని దేవయాని అడుగుతుంది. నాకేం తెలుసు ఏక్కడకైన వెళ్తుంటే.. నేను అడిగితే నీకెందుకు అంటారు కదా అని దేవయానితో ధరణి చెప్తుంది. అంటే నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడని నువ్వు తెలుసుకోవా? అయిన ఈ మధ్య మమ్మల్ని ఎదరించి మాట్లాడడం బాగా అలవాటైందని దేవాయని అంటుంది. అ తర్వాత శైలేంద్ర ఫోన్ కి దేవయాని కాల్ చేస్తుంది. అప్పుడు ముసలావిడ ఫోన్ లిఫ్ట్ చేసి ఈ అబ్బాయికి నరాలు పని చెయ్యడం లేదని అనగానే.. మీరెవరని దేవయాని అడుగుతుంది. అలా అనేసరికి వెంటనే శైలేంద్ర ఫోన్ తీసుకొని.. నీకు అన్ని తర్వాత చెప్తాను మమ్మీ అంటాడు.
ఆ తర్వాత శైలేంద్రకి వాళ్ళు ఇచ్చిన వైద్యం పూర్తవ్వగానే లేచి నిల్చొని.. మీకు రిషి అనే అతను తెలుసా అంటూ రిషి ఫోటో చూపిస్తాడు. ముసలివాళ్ళు శైలేంద్రపై డౌట్ రావడంతో తెలియదని చెప్తారు. అప్పుడే అక్కడికి వసుధార, ముకుల్ లు వస్తారు. వాళ్ళని అక్కడ చుసిన శైలేంద్ర షాక్ అవుతాడు. ఇద్దరి మధ్య మాటలు యుద్ధం జరుగుతుంది.. ముకుల్ ఇండైరక్ట్ గా శైలేంద్రకి కౌంటర్ వేస్తుంటాడు. ఆ తర్వాత శైలేంద్ర వెళ్ళిపోతాడు. ఏంటి వీళ్ళు నన్ను ఫాలో అవుతు ఉంటున్నారా అని శైలేంద్ర అనుకుంటాడు. అసలు రిషి వసుధార ఇంట్లోనే ఉంటాడా తెలుసుకోవాలి.. ఎలా తెలుసుకోవాలని శైలేంద్ర అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |